పుడమి - ఓ ఆడపిల్ల కథ | Pudami (2020) Award-Winning Telugu Heart Touching Short Film

పుడమి - ఓ ఆడపిల్ల కథ

పుడమి - ఓ ఆడపిల్ల కథ | Pudami (2020) Award-Winning Telugu Heart Touching Short Film Casting: Sonia Mudiraj, Nihitha,Sharanya Director: Sridhar Gurram Music Director: Sahithya Sagar Editor: Srinivasa Rajalingu DOP: Ravindra Sun Singers: Aishwarya, Sahithyasagar,Vaishnavi Sound Engineer: Srinivas Sheethalam Producer: Sai Bindu Ande

video link : https://www.youtube.com/watch?v=owMarAVWS5o&t=23s


భారత్ యుద్ధానికి వస్తే.. మేం తిప్పికొడతాం: పాక్ ప్రధాని

భారత్ యుద్ధానికి వస్తే.. మేం తిప్పికొడతాం: పాక్ ప్రధాని



పుల్వామా దాడిలో పాక్ హస్తం ఉందన్న ఆరోపణలకు ఆధారాలు లేవని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ఇలాంటి దాడులతో పాకిస్థాన్‌కు ఏం లాభం జరుగుతుందని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడే పాకిస్థాన్ సుస్థిరంగా మారుతుందన్నారు. పుల్వామా ఉగ్రదాడి ఘటనపై పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇవాళ వీడియో ప్రకటన చేశారు. పాకిస్థాన్‌కు సౌదీ రాజు సల్మాన్ వస్తున్న తరుణంలో.. మేం ఇలాంటి చర్యలు ఎందుకు చేపడుతామని అన్నారు. దాడులతో చర్చలను ఎందుకు తప్పుదోవపట్టిస్తామన్నారు. దాని వల్ల మాకేం లాభం అన్నారు. యుద్ధం చేయడం తమ ఉద్దేశం కాదు అని, కానీ ఆ యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు తామెప్పుడూ సిద్ధమే అన్నారు. ఇంకా గతంలోనే భారత్ జీవించాలనుకుంటుందా అని అన్నారు. ఈ ప్రాంతంలో సుస్థిరత కావాలన్నారు. ఇండియా దగ్గర పుల్వామా దాడికి సంబంధించిన ఆధారాలు ఉంటే సమర్పించాలని, దాని పట్ల మేం చర్యలు తీసుకుంటామన్నారు. ఒకవేళ భారత్ యుద్ధానికి వస్తే, దాన్ని తిప్పికొట్టేందుకు తాము వెనుకాడబోమన్నారు. ఇక్కడ నుంచి భారత్‌కు వెళ్లి ఉగ్రదాడులు చేయాలన్న ఉద్దేశం తమకు లేదన్నారు.

ఇంటెలిజెన్స్ సమాచారాన్ని అందిస్తే.. పుల్వామా ఘటన పట్ల విచారణ చేపడుతామని ఇమ్రాన్ అన్నారు. అంతకముందు పుల్వామాపై ఇమ్రాన్ ప్రకటన చేయనున్నట్లు సమాచారశాఖ మంత్రి ఫావద్ చౌదరీ ట్వీట్ ద్వారా వెల్లడించారు. ఈనెల 14వ తేదీన జైషే ఉగ్రవాది ఆదిల్ కారు బాంబుతో ఆత్మాహుతి దాడికి దిగాడు.

సీఆర్‌పీఎప్ కాన్వాయ్‌పై జరిగిన దాడిలో 44 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.